![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి ( Godhavari )'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-40లో.. శాంత, నందు, కిన్నెర, జాను వాళ్ళ అమ్మ, నానమ్మ అందరు భోజనం చేయడానికి కూర్చుంటారు. కాకర కాయ కూర చేదుగా ఉంటుంది.. నాకు వద్దు అక్క అని నందుతో కిన్నెర అంటుంది. దాంతో అత్తయ్య వేరే కూర లేదా అని నందు అంటుంది. పోనీలే పాపం అని పులుసు పోస్తే పులుపు తక్కువైందని వంకలు పెట్టారంట .. మీ వరస కూడా అలాగే ఉంది. మీకు నచ్చింది వండిపెట్టడానికి, నాలుగు అయిదు కూరలు చేయడానికి నేనీమీ మీ పనిమనిషిని కాదని శాంత అంటుంది. నిన్నేం వండమనట్లేదు కదా.. కిచెన్ లోకి వెళ్ళి మేమే వండుకుంటామని నందు అంటుంది. ఇక శాంత నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. దాంతో శాంత, నందు మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. అప్పుడే జాను, మురళి వస్తారు.
ఇద్దరు గొడవపడకండి అని జానూ చెప్తుంది. అయినా వినకుండా నందు మాట్లాడుతుంది. కిచెన్ లోకి వస్తే కాళ్ళు విరగ్గొడతా అని శాంతా వండిన ఆహారాన్ని వంటగదిలోకి తీసుకెళ్తుంది. ఇకనుండి మా వాళ్ళకేం కావాలో నేను చూసుకుంటానని జానూ అంటుంది. ఇక నందు ఇంకా వాళ్ళ అమ్మ, నానమ్మ, కిన్నెర అంతా కలిసి ఇంటి బయట వెయిట్ చేస్తుంటారు. కాసేపటికి జానూ, మురళి అందరికి భోజనం తీసుకొని వస్తారు. ఇక అందరికి భోజనం ఇస్తారు. కిన్నెర కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఏమైందని మురళి అడుగగా నాన్న గుర్తొచ్చాడని కిన్నెర అంటుంది. దాంతో అంతా ఎమోషనల్ అవుతారు. ఇక నందుకి మురళి, జాను ఇద్దరు తినమని చెప్తారు. కానీ తను తినని చెప్తుంది. దాంతో అందరు కలిసి తనని బ్రతిమిలాడి తినిపిస్తారు.
భువన సీరియస్ గా ఉంటుంది. అప్పుడే ఇంటికి సూర్య వస్తాడు. అమ్మ కూల్ గా ఉందేంటని సూర్య అనుకొని మెల్లిగా బ్యాక్ డోర్ నుండి కిచెన్ లోకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. ఇక అమ్మా ఆకలి అవుతుందని సూర్య అంటాడు. దానికి భవన ఏం సమాధానమివ్వదు. ఇక సూర్య డైనింగ్ టేబుల్ దగ్గర నుండి వాళ్ల అమ్మ భువన దగ్గరకి వస్తాడు. ఏం అయిందని భువనని సూర్య అడుగుతాడు. నేను కాల్ చేస్తుంటే నువ్వు ఎందుకు తీయలేదు.. అది కూడా ఆ అమ్మాయి పక్కన నుండి నువ్వు నా కాల్ తీయలేదు.. నేను మాత్రం అనుక్షణం నా కొడుకు..నా కొడుకు అని ఆలోచిస్తున్నానని భువన అంటుంది. అదేం లేదమ్మా అని సూర్య ఏదో చెప్పబోతుంటే భువన తనని ఆపి..నువ్వు మారిపోయావ్ సూర్య , నన్ను పట్టించుకోవడం లేదని అంటుంది. దాంతో సూర్య తనని బ్రతిమిలాడి తినిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |